Saturday, January 15, 2011

జపం ఏయే ప్రదేశాల్లో చేయాలి?

ఇంట్లోనే జపం ఎంత చేస్తే అంత ఫలితము ఉంటుంది. నదీ పరిసర ప్రాంతాల్లో జపం చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది. గోశాలలో జపం చేస్తే వందరెట్లు, యాగశాలలో జపం చేస్తే అంతకు మించి ఫలితం వస్తుంది.
పుణ్య ప్రదేశాలలో, దేవతా సన్నిధిలోనూ, జపం చేస్తే 10 వేల రెట్లు ఫలితం వస్తుంది. శివాలయంలోగానీ, శివసానిధ్యంలో గానీ, జపం చేస్తే మహోన్నతమైన ఫలితం వస్తుంది. పులితోలు మీద కూర్చుని జపం చేస్తే మోక్షం కలుగుతుంది.
అలాగే వెదురు చాపపై కూర్చుని జపం చేస్తే దరిద్రం ఆవహిస్తుంది. రాయిమీద కూర్చుని జపం చేస్తే రోగాలు వస్తాయి. కటిక నేల మీద కూర్చుని జపం చేస్తే దుఃఖము సంభవిస్తుంది. కోయ్యపీట మీద కూర్చుని జపం చేస్తే దారిద్ర్యం కలుగుతుంది. గడ్డి మీద కూర్చుని జపం చేస్తే కీర్తి నాశనము అవుతుంది.

No comments:

Post a Comment