Thursday, December 30, 2010

ఆదిత్య హృదయం ఫలశ్రుతి ఏమి?

ఆదిత్య హృదయం రామ రావణ యుద్ధ సమయంలో అగస్త్య మహర్షి రామునకు ఉపదేశించాడు .
దైవతస్చ సమాగమ్య ద్రస్తుమభ్యాగతోరణం
ఉపగమ్యాధ్బ్రైవీద్రామ మగస్త్యో భాగావానృషి:
అనే శ్లోకం పై విషయాన్నే తెలుపుతున్నది.
ఆదిత్య హృదయం పుణ్యం - సర్వశత్రు వినాశనం
జయావహం జపేన్నిత్యమ్ - అక్షయ్యం పరమం శుభం
సర్వ మంగళ మాంగల్యం - సర్వపాప ప్రణాశనం
చింతాశోకప్రవమనం - ఆయుర్వర్ధనముత్తమమ్
ఆదిత్య హృదయం పుణ్యప్రదం, కామక్రోధాది అంతశ్శత్రువులను బహిశ్శత్రువులను నాశనం చేస్తుంది. ప్రతినిత్యం జపిస్తే విజయం లభిస్తుంది. అక్షయత్వాన్ని కల్పిస్తుంది. శ్రేష్ఠమైన శుభాలనిస్తుంది. పాపము లన్న్నింటినీ నాశనం చేస్తుంది. చింతలు దుఃఖఃములనుండి ఉపశమనం కల్పిస్తుంది. ఆయువును పెంపొందిస్తుంది. ఈ విధంగా ఎన్నో ఫలములు చెప్పబడ్డాయి .

No comments:

Post a Comment