Monday, January 3, 2011
జ్యోతిర్లింగ దర్శన ఫలం
సౌరాష్ట్ర సోమనాథుడ్ని దర్శించిన భోగభాగ్యాలు కలుగుతాయి. శ్రీశైల మల్లికార్జుడ్ని సేవించిన సర్వదరిద్రాలు సమిసిపోతాయి. ఉజ్జయిని మహాకాలుడ్ని కొలిచిన సర్వ భయ పాపాలు హరించుకుపోతాయి. ఓంకారేశ్వరము అమరల్లింగేశ్వరుడు, ఇహపరాలు, సౌఖ్యాన్నిస్తాడు. పరళి వైద్యనాధ లింగాన్ని సేవించిన అనేక దీర్ఘవ్యాథులు నయమవుతాయి. భీమేశ్వరము భీమేశ్వరలింగాన్ని దర్శించిన శత్రుజయం కలిగి అకాల మృత్యు భయాలు తొలగి పోతాయి. రామేశ్వరము రామేశ్వరలింగాన్ని దర్శించి, కాశీలో గంగ జలాన్ని అభిషేకించిన, మహోన్నతమైన పుణ్యఫలం కలిగి పరమ పదాన్ని చేరుతారు. ద్వారక నాగేశ్వరుడ్ని దర్శించిన మహపాతకాలూ, ఉపపాతకాలూ నశిస్తాయి. కాశీ, విశ్వేశ్వర లింగాన్ని సేవించిన సమస్త కర్మబంథాల నుంచి విముక్తి. నాసిక్ త్రయంబకేశ్వర స్వామిని కొలిచిన కోరికలు తీరుతాయి. అపవాదులు పోతాయి. హిమాలయ కేదారేశ్వర లింగాన్ని దర్శించిన వారు ముక్తిని పొందుతారు. వీరులు ఘ్రుష్ణేశ్వర లింగాన్ని దర్శించిన ఇహపర భోగాలను అందిస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment